సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు బాహుబలి ఫేమ్ రానా దగ్గుబాటి "భీమ్లా నాయక్" సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఈ చిత్రంలో నిత్యా మీనన్ , సంయుక్త మీనన్ కూడా కథానాయికలుగా నటిస్తున్నారు.ఈ నెల 25న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు.పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుతున్న ఈ సినిమా కి పవన్ కళ్యాణ్ డబ్బింగ్ కంప్లీట్ చేసాడని లేటెస్ట్ టాక్.OTT స్ట్రీమింగ్ భాగస్వామిని "భీమ్లా నాయక్ " లాక్ చేసింది .తాజా అప్డేట్ ప్రకారం, "భీమ్లా నాయక్" పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని డిస్నీ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది . శాటిలైట్ రైట్‌ని స్టార్ మా దక్కించుకుందని అని వార్తలు వినిపిస్తున్నాయి .మూవీ మేకర్స్ అండ్ డిస్నీ హాట్‌స్టార్ కానీ ఈ విషయాన్ని ఇంకా ఆఫిసిఅల్ గా అనౌన్స్ చేయలేదు."భీమ్లా నాయక్" చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగ వంశీ బ్యాంక్రోల్ చేయగా మరియు థమన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa