మోహన్ బాబు నటించిన 'సన్ ఆఫ్ ఇండియా' ఇవాళ సినిమా థియేటర్లలో విడుదలైంది. డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేసిన ఈ సినిమాను 24 ఫ్రేమ్స్, ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మంచు విష్ణు నిర్మించారు. శ్రీకాంత్, ప్రగ్యా జైశ్వాల్, తనికెళ్ల భరణి, అలీ, సునీల్ తదితరులు నటించారు. ఇళయరాజా సంగీతం అందించారు. ఓటీటీ వేదికలే లక్ష్యంగా తీసిన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు.
కథేమిటంటే: కడియం బాబ్జీ (మోహన్‌బాబు) ఓ డ్రైవర్. ఎన్.ఐ.ఎ అధికారిణి ఐరా (ప్రగ్యాజైశ్వాల్) దగ్గర పనిచేస్తుంటాడు. కేంద్ర మంత్రి మహేంద్ర భూపతి (శ్రీకాంత్)తో పాటు మరో ఇద్దరు కిడ్నాప్ అవుతారు. ఐరా నేతృత్వంలోని ఎన్.ఐ.ఎ బృందం ఆ కేస్‌ని ఛేదించడం కోసం రంగంలోకి దిగుతుంది. ఆ మూడు కిడ్నాప్‌లకి సూత్రధారి బాబ్జీనే అని తేలుతుంది. బాబ్జీ అసలు పేరు విరూపాక్ష అని తెలుస్తుంది. అతను పదహారేళ్లు జైలు జీవితాన్ని గడిపి వచ్చిన వ్యక్తి. ఇంతకీ అతని గతమేమిటి? అతను కిడ్నాప్‌లకి పాల్పడటానికి కారణమేంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఈ సినిమాని ఓ ప్రయోగంలానే తీశారు. చాలా సన్నివేశాల్లో మోహన్‌బాబు మాత్రమే కనిపిస్తారు. మిగతా పాత్రలు కనిపించకుండా, కేవలం వినిపిస్తాయి. తనకి జరిగిన అన్యాయంపై ఓ వ్యక్తి ప్రతీకారం తీర్చుకోవడం, తనలా ఇంకెవ్వరికీ జరగకూడదని సాగించే పోరాటమే ఈ కథ. ఈ కథ చిరంజీవి వాయిస్ ఓవర్ తో మొదలవుతుంది. మోహన్‌బాబు పాత్రని పరిచయం చేసిన విధానం బాగుంది. ఆ తర్వాత బాబ్జీ వరుసగా చేసే కిడ్నాప్‌లు ఆసక్తిని రేకెత్తిస్తాయి. గంటన్నర నిడివి ఉన్న చిత్రమిది. మోహన్ బాబు డైలాగ్స్ బాగున్నాయి. హాస్యనటులున్నా ఆ సన్నివేశాలు పెద్దగా నవ్వించవు. మోహన్‌బాబు వన్ మేన్ షో అని చెప్పొచ్చు. సినిమాలో మిగతా పాత్రలను బ్లర్ చేస్తూ, లేదంటే వెనక నుంచి చూపిస్తూ కెమెరాతో ప్రయోగం చేశారు. కొత్త కథ కాకపోవడం ఈ సినిమాకు మైనస్ అయ్యింది.
రేటింగ్: 2.5/5
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa