ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రేక్షకులను నా సోదరులుగా భావించడం వల్లే నేను అలా అన్నా

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 18, 2022, 07:26 PM

తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో దానిపై  సితార ఎంటర్టయిన్ మెంట్స్ అధినేత, ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియాలో ఓ ప్రకటన ద్వారా వివరణ ఇచ్చారు. డీజే టిల్లు చిత్రం విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించినట్టు తెలిసిందని, అందుకు తాను బాధపడుతున్నానని తెలిపారు. 'ప్రేక్షకులను నా సోదరులుగా భావించడం వల్లే వారిని ఏకవచనంతో సంబోధించాను' అని వివరణ ఇచ్చారు. అయినా వారి మనసు నొచ్చుకోవడం పట్ల క్షమాపణలు తెలుపుకుంటున్నట్టు తన ప్రకటనలో పేర్కొన్నారు. "ప్రేక్షకులు అంటే మాకు ఎంతో గౌరవం. ఏ చిత్ర నిర్మాణ సంస్థకైనా వారే బలం. ప్రేక్షకులు పెట్టే విలువైన డబ్బుకు మించిన వినోదం అందించామని డీజే టిల్లు రిలీజ్ సందర్భంగా వ్యాఖ్యానించాను. మీడియాతో అన్న మాటలు ప్రేక్షకులను బాధించాయని తెలిసింది. అందుకు క్షంతవ్యుడను. ప్రేక్షకులు అంటే మాకెంతో గౌరవం అని మరోసారి చెబుతున్నాను, వారే మా బలం" అంటూ నాగవంశీ వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa