సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , బాహుబలి ఫేమ్ రానా దగ్గుబాటి "భీమ్లా నాయక్" సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నిత్యా మీనన్ , సంయుక్త మీనన్ కూడా కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ నెల 25న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్లలో కూడా అదిరిపోయే బుకింగ్స్ రాబట్టుకుంటున్న ఈ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ కి ఇంకా చాలా టైం మిగిలి ఉండటంతో ఈ గ్యాప్ లో ట్రైలర్, ప్రీ రిలీజ్ సెలబ్రేషన్స్ పై పలు ఊహాగానాలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించి చాలా మంది స్టార్ హీరోల పేర్లు వినిపిస్తున్నాయి కానీ అసలు ఈ వేడుకకు పెద్ద స్టార్ ఎవరూ హాజరుకావడం లేదనేది అసలు క్లారిటీ. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు చిత్ర యూనిట్ మాత్రమే హాజరుకానుంది. అలాగే ఈ ఈవెంట్ డేట్ కూడా త్వరలో ప్రకటిస్తారని మరో టాక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa