ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆడవాళ్లు మీకు జోహార్లు' రిలీజ్ వాయిదా

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 20, 2022, 09:21 AM

కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్, రష్మీ జంటగా తెరకెక్కిన చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. అయితే అదే రోజున 'భీమ్లా నాయక్' సినిమా రావడంతో మార్చి 4కి సినిమా వాయిదా పడింది.ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ కొత్త రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే పాపులర్ అయ్యాయి. రాధిక .. ఖుష్బూ .. ఊర్వశి కీలక పాత్రలు పోషించారు. వెన్నెల కిషోర్‌ కామెడీ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. 'మహానుభావుడు' తర్వాత శర్వానంద్‌కి హిట్‌ రాలేదు. 'రణరంగం' .. 'జాను' .. 'మహాసముద్రం' వంటి ప్రయోగాలను డీల్ చేశాడు. ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొడతానన్న నమ్మకంతో ఉన్నాడు. మరి ఈ సినిమాపై ఆయన నమ్మకం ఎంత వరకు నిలుస్తుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa