ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినీ పరిశ్రమ సమస్యలపై ప్రముఖుల భేటీ

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 20, 2022, 03:21 PM

సినిమా టిక్కెట్ల వ్యవహారం మొదలు పలు సమస్యలను ఎదుర్కొంటున్న సినిమా రంగంపై చర్చించేందుకు ఆ రంగ ప్రముఖులు సమావేశమవుతున్నారు. సినీ పరిశ్రమ సమస్యలపై చ‌ర్చించేందుకు టాలీవుడ్‌ ప్రముఖులు భేటీ అయ్యారు. హైద‌రాబాద్‌లోని ఫిల్మ్‌ నగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో.. సినీ ఇండస్ట్రీకి చెందిన 24 క్లాఫ్ట్స్‌ సభ్యులు ఇందులో పాల్గొంటున్నారు. ఈ స‌మావేశానికి మొత్తం 240 మంది సభ్యులకు ఆహ్వానం అందిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఫిల్మ్‌ నగర్‌ కల్చరల్‌ క్లబ్‌కు వ‌చ్చిన వారిలో నిర్మాత‌లు సి.క‌ల్యాణ్‌, ప్ర‌స‌న్న కుమార్, త‌మ్మారెడ్డి, ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి త‌దిత‌రులు ఉన్నారు. సినీ కార్మికుల సంక్షేమంపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ల ధరలపెంపు అంశంపై ప్రభుత్వం నుంచి ముందడుగు పడిన నేప‌థ్యంలో దీనిపై కూడా చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa