ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాఫియా డాన్ పాత్రలో చిరు... కొత్త తరహా పాత్రలో

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 21, 2022, 06:47 PM

గతానికి భిన్నంగా మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రంలో ఓ పాత్రను పోషించనున్నారు. దర్శకుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూనే వెంకీ కుడుముల భారీ విజయాలను అందుకున్నాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'ఛలో' .. 'భీష్మ' సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. ఆ తరువాత ప్రాజెక్టును ఆయన చిరంజీవితోనే చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంలో చాలామందిలో సందేహం తలెత్తింది. నిజంగానే వెంకీ కుడుములతో సినిమా చేయడానికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. వెంకీ కుడుముల స్క్రిప్ట్ వినిపించగానే ఆయన ఓకే చెప్పడం జరిగిపోయిందని అంటున్నారు. చిరంజీవి 'మాఫియా డాన్' గా కనిపించనున్న ఈ సినిమాను, డీవీవీ దానయ్య నిర్మిస్తున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమాను విడుదల చేయాలనేది ప్లాన్. ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న 'గాడ్ ఫాదర్' ముగింపు దశకి చేరుకుంది. ఆ తరువాత 'భోళాశంకర్' .. 'వాల్తేరు వీర్రాజు' సినిమాలు పూర్తిచేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు షూటింగు పార్టు కంప్లీట్ చేసిన తరువాత ఆయన వెంకీ కుడుములతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారని తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa