నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌లో "అఖండ" ఒకటి అని చెప్పొచ్చు . ప్రస్తుతం, బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన కొత్త సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేసాడు .ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది.దునియా విజయ్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు.ఈ సినిమా రెగ్యులర్ షూట్ సిరిసిల్లలో స్టార్ట్ అవుతుంది అని మేకర్స్ ప్రకటించారు .ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ రిలీజ్ చేసారు.ఈ పోస్టర్ లో బాలయ్య లుక్స్ చాలా ఇంటెన్స్‌గా ఉన్నాయి అని భావిస్తున్నారు . బాలయ్య సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ మాస్ డ్రామా సినిమాకి యాక్షన్ సీక్వెన్స్‌కు రామ్-లక్ష్మణ్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.NBK107 సినిమాలో బాలయ్య కొత్త లుక్ లో కనిపించనున్నారు అని మూవీ మేకర్స్ వెళ్ళడించారు.ఈ 2022 దసరాకి సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa