ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"భీమ్లా నాయక్" పవర్ ప్యాక్డ్ ట్రైలర్ అవుట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 22, 2022, 12:20 PM

సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ , బాహుబలి ఫేమ్ రానా దగ్గుబాటి నటిస్తున "భీమ్లా నాయక్" విడుదల చెయ్యటానికి మూవీ మేకర్స్ సిద్దంగా ఉన్నారు.ఈ చిత్రంలో నిత్యా మీనన్ , సంయుక్త మీనన్ కూడా కథానాయికలుగా నటిస్తున్నారు.పవర్‌స్టార్ ఫాన్స్ ఈ సినిమా  కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు . ఫిబ్రవరి 25, 2022న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.తాజాగా , మూవీ మేకర్స్ ఈ సినిమా  ట్రైలర్ ని లాంచ్ చేసారు.ట్రైలర్ లో పవన్ ఇంట్రడక్షన్ , స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్, ఇంటెన్సిటీ స్టన్నింగ్ గా ఉన్నాయి అని భావిస్తున్నారు .రానా క్యారెక్టర్ ని కూడా చాల  సాలిడ్ గా చూపించారు . విజువల్స్, లోకల్ సెటప్ అండ్  యాక్షన్ బ్లాక్స్ కూడా తీశారు అని చెప్పొచ్చు . పవన్ ఫాన్స్ అండ్ సినిమా లవర్స్ కి  థియేటర్లలో ఫుల్ జోష్ ఉంటుంది అని లేటెస్ట్ టాక్ .ఈ ట్రైలర్ సినిమాపై ఫుల్  హైప్‌ని పెంచింది."భీమ్లా నాయక్" చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగ వంశీ బ్యాంక్రోల్ చేయగా మరియు  థమన్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa