టాలీవుడ్ పవర్ స్టార్ అండ్ రానా నటించిన "భీమ్లా నాయక్" ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 21న జరగాల్సిన ఉంది.కానీ , ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మూవీ మేకర్స్ క్యాన్సిల్ చేసిన సంగతి తెలిసిందే.లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే, "భీమ్లా నాయక్" మేకర్స్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం కొత్త డేట్ ని లాక్ చేసారు.ఫిబ్రవరి 23న యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో ఈ ఈవెంట్ జరగనుంది అని మేకర్స్ అనౌన్స్ చేసారు .ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరుకానున్నారు అని సమాచారం.ఈ నెల 25న "భీమ్లా నాయక్" థియేట్రికల్ రిలీజ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa