వలిమై ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సిద్దమైంది. నేటి సాయంత్రం ఆ వేడుక జరగనున్నది. అజిత్ హీరోగా వినోద్ దర్శకత్వంలో 'వలిమై' సినిమా రూపొందింది. బోనీ కపూర్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాను, తమిళంతో పాటు ఇతర భాషల్లోను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు. హుమా ఖురేషి కథానాయికగా నటించిన ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కార్తికేయ కనిపించనున్నాడు. తమిళనాట ఈ సినిమా ప్రమోషన్స్ ఒక రేంజ్ లో జరుగుతున్నాయి. ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇక్కడ మాత్రం ఎలాంటి హడావిడి లేకపోవడం పట్ల సోషల్ మీడియా ద్వారా అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కొంతసేపటి క్రితమే వదిలారు. హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీన్స్ తో వదిలిన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు పెంచింది. 'భీమ్లా నాయక్'కి ఒక రోజు ముందు రంగంలోకి దిగుతున్న ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa