సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో కోలీవుడ్ స్టార్ హీరో నటించిన "వాలిమై" సినిమా ఒకటి అని చెప్పొచ్చు . హెచ్.వినోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 24న థియేటర్లలోకి రానుంది అని మేకర్స్ అనౌన్స్ చేసారు . యాక్షన్ డ్రామా ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో అజిత్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు అని మేకర్స్ వెల్లడించారు .హ్యూమా ఖురేషి అజిత్ సరసన జంటగా నటిస్తుండగా ,టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ విలన్ గా నటిస్తున్నారు. మూవీ మేకర్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ "వాలిమై" సినిమా గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు ."వాలిమై" తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఈ రోజు పార్క్ హయత్ హోటల్‌లో సాయంత్రం 6 గంటలకు జరగనుంది అని మేకర్స్ అనౌన్స్ చేసారు . ఈ మూవీని హిందీ, కన్నడలో కూడా విడుదల చేయనున్నారు.బోనీకపూర్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో యామీ గౌతమ్, బాణి, సుమిత్ర, అచ్యుంత్ కుమార్, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa