భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 23న హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరగనుంది. దీంతో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. 'ఈ నెల 21న జారీ చేసిన పాస్‌లు చెల్లవు. ఆ పాస్‌లతో రావడానికి అనుమతి లేదు. జూబ్లీహిల్స్-యూసఫ్‌గూడ మార్గంలో ఇరువైపులా వాహనాలను దారి మళ్లిస్తున్నాం. మిగిలిన వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి. ఫంక్షన్‌కు వచ్చే వారు తమ వాహనాలను ఎంపిక చేసిన ప్రదేశాల్లో పార్క్ చేయాలి' అని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa