ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేటుగాడి వలలో కుర్ర హీరోయిన్లు?

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 23, 2022, 04:50 PM

జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహీలతో సంబంధాలు నెరిపాడనే ఆరోపణలున్న కేటుగాడు సుఖేష్ చంద్రశేఖర్ వలలో పలువురు హీరోయిన్లు ఉన్నారని తెలుస్తోంది. తనకు మరో ముగ్గురు హీరోయిన్లతో పరిచయం ఉన్నట్లు అతడు ఈడీ విచారణలో పేర్కొనడం సంచలనాలను రేకెత్తిస్తోంది. యువ హీరోయిన్లు సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్, భూమి పెడ్నేకర్‌లను బహుమతులిస్తాననే పేరుతో పరిచయమైనట్లు తెలుస్తోంది. సుకేష్ మే 2021లో సారా అలీ ఖాన్‌ను టార్గెట్ చేశాడని ఈడీ తెలిపింది. ఆమెకు వాట్సాప్‌లో సూరజ్ రెడ్డిగా పరిచయం చేసుకున్నాడని, కారును గిఫ్ట్‌గా ఇస్తానని చెప్పాడని పేర్కొంది. తన కంపెనీ సీఈవో ఇరానీ కలుస్తారని చెప్పి, ఆమెను పంపాడన్నారు. ఇక జాన్వీ కపూర్‌ను కూడా పరిచయం చేసుకుని రూ.18 లక్షలకు పైగా విలువైన వస్తువులను బహుమతిగా ఇచ్చాడని పేర్కొన్నారు. మరో నటి భూమిపడ్నేకర్‌ను కూడా సంప్రదించి, కారును ఇస్తానని ఆపర్ చేశాడన్నారు. వీరిపై ఈడీ విచారణలో భాగంగా ప్రశ్నల వర్షం కురిపించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa