సినీవారసుల కుమారులు రంగ ప్రవేశం సహజం. నటుడి వారసులు నటనపరంగానే రంగప్రవేశం చేస్తారు. కానీ ఇక్కడ బాలివుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు రంగ ప్రవేశం వినూత్నంగా సాగుతోంది. ఇటీవలే డ్రగ్స్ కేసులో హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ పేరు ప్రముఖంగా వినిపించడం తెలిసిందే. ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం బెయిల్ పై బయటున్నాడు. కాగా, ఆర్యన్ ఖాన్ వెండితెర అరంగేట్రానికి రంగం సిద్ధమవుతోంది. అయితే హీరోగా మాత్రం కాదు. షారుఖ్ తనయుడు ఓ రచయితగా వినోద రంగంలో ప్రవేశించనున్నాడు. ఆర్యన్ ఖాన్ అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో ఫైన్ ఆర్ట్స్, సినిమాటిక్ ఆర్ట్స్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడక్షన్ సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. అయితే కెమెరా ముందుకొచ్చే బదులు, తనలోని క్రియేటివిటీని చాటుతూ కలంతో కొత్త కథలు సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. త్వరలోనే ఓటీటీ వేదిక కోసం ఓ వెబ్ సిరీస్ కు కథ అందించనున్నాడు. అంతేకాదు, ఓ సినిమాకు కూడా రైటర్ గా వ్యవహరించనున్నాడు. ఆ చిత్రాన్ని షారుఖ్ ఖాన్ కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ నిర్మించనుంది. ఆర్యన్ కథ అందించే వెబ్ సిరీస్ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. కాగా, ఈ ప్రాజెక్టుల కోసం ఆర్యన్... బిలాల్ సిద్ధిఖీ నుంచి రచనా సహకారం అందుకోనున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa