ప్రభాస్ రేంజ్ ఏమిటో అందరికీ తెలుసు. అందుకు అనుగుణంగానే సినిమాల రూపకల్పన సాగుతోంది. ప్రభాస్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'రాధే శ్యామ్' రెడీ అవుతోంది. ఆ తరువాత సినిమాలుగా ఆయన నుంచి 'ఆది పురుష్' .. 'సలార్' పాన్ ఇండియా స్థాయిలో పలకరించనున్నాయి. ఇక ప్రస్తుతం ఆయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్టు K' చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన సూపర్ హీరోగా కనిపించనున్నాడు. ఆ తరువాత ఆయన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' చేయవచ్చని అంతా అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు కంటే ముందుగా ఆయన మారుతి సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానర్లో మారుతి 'రాజా డీలక్స్' సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. మారుతి కూడా ఈ వార్తలను ఖండించలేదు. ఇప్పుడు ఈ సినిమా కోసం చాలా ఫాస్టుగా సెట్స్ నిర్మాణం జరుగుతోందని చెబుతున్నారు. చాలా వరకూ ఈ సెట్స్ లోనే షూటింగు జరుగుతుందని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన చేసి, పెద్దగా గ్యాప్ లేకుండానే రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారని చెప్పుకుంటున్నారు. దీనిని బట్టి 'స్పిరిట్' కాస్త ఆలస్యమయ్యేలానే ఉంది మరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa