విభన్నపాత్రలను పోషించి సినీఅభిమానులను అలరించిన కమల్ హాసన్ విక్రమ్ సినిమాలో మరో కొత్త రోల్ లో కనిపించనున్నారు. కమలహాసన్ కథానాయకుడిగా 'విక్రమ్' సినిమా రూపొందింది. కమల్ సొంత బ్యానర్లో భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాకి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి .. ఫహాద్ ఫాజిల్ .. నరేన్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. కమల్ అభిమానులంతా కూడా ఈ సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో కమల్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నారు. తన ఆపరేషన్ లో భాగంగా ఆయన కొన్ని సందర్భాల్లో నెగెటివ్ షేడ్స్ లోను కనిపిస్తారని అంటున్నారు. ఈ సినిమాలో మొదటి నుంచి చివరి వరకూ హీరో - విలన్ ఎదురుపడకుండా ఇద్దరి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ నడుస్తుందట. ఇక ఈ ఇద్దరూ కూడా క్లైమాక్స్ లో ఎదురుపడతారు. అప్పుడు ఇద్దరి మధ్య చోటుచేసుకునే యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. సినిమా అంతా ఒక ఎత్తు .. ఈ క్లైమాక్స్ ఒక ఎత్తు అని అందరూ చెప్పుకునేలా ఉంటుందని అంటున్నారు. లోకేశ్ కనగరాజ్ స్క్రీన్ ప్లే మరో హైలైట్ అవుతుందని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa