టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా నటించిన "భీమ్లా నాయక్" సినిమా ఈ నెల 25న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలు మరియు పాటలకు ప్రేక్షకుల నుండి మరియు అభిమానుల నుండి భారీ స్పందన వస్తోంది. అయితే, ప్రీ-బుకింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపటికే భీమ్లా తన ఫైర్‌ని ప్రదర్శిస్తున్నాడు. అదే దూకుడు యూఎస్ఏలోనూ ప్రదర్శిస్తున్నాడు భీమ్లా నాయక్. ప్రీ-సేల్స్‌తో మొత్తం ఇప్పటివరకు $ 600k పైగా పొందింది. నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో మురళీ శర్మ, రావు రమేష్, సముద్ర ఖని కీలక పాత్రలు పోషించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa