హీరోగా వరుస పరాజయాలను చవిచూసిన సునీల్.. ఆ తర్వాత కమెడియన్ గా కొనసాగాలని భావించాడు. అయితే ఆ పాత్రలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. దాంతో విలక్షణమైన పాత్రలపై దృష్టి సారిస్తూ ఆ దిశగా అడుగులు వేశారు. అతను తీసుకున్న నిర్ణయం బాగా వర్కవుట్ అయింది. వైవిధ్యమైన.. విలక్షణమైన పాత్రలు సునీల్‌ను వెతుక్కుంటూ వస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన 'కలర్ ఫోటో', రీసెంట్ గా వచ్చిన 'పుష్ప' సినిమాలు అతనికి మరింత క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలోనే మరో కొత్త ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రానికి 'కుంభకర్ణ' అనే టైటిల్‌ను ఖరారు చేసి తాజాగా పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి 'పడుకుంటే పోతాడు' అనేది ట్యాగ్ లైన్. సునీల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కబీర్ దుహన్ సింగ్ విలన్‌గా నటిస్తున్నాడు. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభిరామ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇతర వివరాలు త్వరలో తెలియనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa