ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ సంమ్ థింగ్ స్పేషల్: దగ్గుబాటి రానా

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 24, 2022, 01:38 PM

ఎంతో మంది స్టార్ హీరోలను చూశా కానీ పవన్ కళ్యాణ్ సంమ్ థింగ్ స్పేషల్ అన్నారు హీరో, నటుడు దగ్గుబాటి రానా. పవన్ కల్యాణ్ - రానా ప్రధానమైన పాత్రలను పోషించిన 'భీమ్లా నాయక్' ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రానా మాట్లాడుతూ .. " నటుడిగా నా ప్రయాణం మొదలుపెట్టి 12 ఏళ్లు అయింది. కెరియర్ మొదట్లో నా వలన సినిమా చెడిపోకూడదని కొంతమంది దర్శకులు నాకు యాక్టింగ్ నేర్పించారు. నటుడినయ్యాను .. హీరోను కావడానికి ఏం చేయాలనే కాన్సెప్ట్ మాత్రం నాకు అర్థం కాలేదు. ఆ విషయాన్ని తెలుసుకోవడానికి నేను తిరుగుతున్న రోజుల్లో నాకు ఎదురుపడిన హీరోనే పవన్ కల్యాణ్. ఇంతవరకూ నేను తెలుగు .. హిందీ .. తమిళ సినిమాలు చేశాను. ఎంతోమంది స్టార్స్ తో కలిసి పనిచేశాను. కానీ పవన్ కల్యాణ్ గారు డిఫరెంట్ .. సమ్ థింగ్ స్పెషల్. నాపై ఆయన ఎంతో ప్రభావం చూపించారు. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలకీ .. పవన్ కల్యాణ్ గారి ద్వారా ప్రభావితం అయిన తరువాత చేసే సినిమాలకి తప్పకుండా తేడా ఉంటుంది. 25వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకం నాకు ఉంది" అని చెప్పుకొచ్చాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa