రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో పూజా హెగ్డే నటించిన తాజా చిత్రం "రాధే శ్యామ్". మరి కొద్ది రోజుల్లోనే ఈ భారీ బడ్జెట్ విజువల్ వండర్ విడుదల కానుందని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే వాలెంటైన్స్ డే నుంచి మేకర్స్ కాస్త సైలెంట్ గా ఉన్నారు. అయితే ఇక నుంచి అసలు రచ్చ ప్రారంభించడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రమోషన్స్ సంగతి పక్కన పెడితే.. ఈ రెండు రోజుల్లో ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ రాబోతుందని తెలుస్తోంది. మరి ఇది సినిమాలోని తదుపరి పాట కోసమా లేక మరేదైనా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. దీంతో ఇప్పటికే అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa