ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"వాలిమై" యుఎస్ ప్రీమియర్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 24, 2022, 03:52 PM

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన "వాలిమై" సినిమా  ఈరోజు వరల్డ్ వైడ్ గా  థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఫాన్స్ అండ్ సినిమా లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని సంపాదించింది. నిన్న,USA అండ్ ఇతర విదేశాలలో "వాలిమై" ప్రీమియర్లు జరిగాయి. అజిత్ "వాలిమై" USA లో గంటకు $121k కలెక్ట్ చేస్తుంది అని  సోషల్ మీడియాలోవార్తలు వినిపిస్తున్నాయి. హెచ్.వినోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో  టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ విలన్ గా నటిస్తున్నారు. ఈ మూవీని హిందీ, క‌న్న‌డ‌లో కూడా విడుద‌ల చేయ‌నున్నారు. బోనీకపూర్‌, జీ స్టూడియోస్‌  నిర్మిస్తున్న ఈ సినిమాలో  యామీ గౌతమ్‌, బాణి, సుమిత్ర, అచ్యుంత్‌ కుమార్‌, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa