పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సర్వత్రా ఆసక్తిని పెంచింది. మలయాళంలో 2020లో విడుదలైన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రం ఆధారంగా భీమ్లా నాయక్‌ను రూపొందించారు. పవన్‌తో పాటు రానా ఇందులో నటించారు.
ఇక సినిమా కథలోకి వెళ్తే మిలిటరీలో పని చేసి వచ్చిన డ్యానీ(రానా) అనే యువకుడు తనకు తిరుగులేదనే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అదే ఊరికి ఎస్ఐగా వచ్చిన భీమ్లా నాయక్(పవన్ కళ్యాణ్)తో డ్యానీకి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ క్రమంలో ఓ కేసు విషయంలో డ్యానీని భీమ్లా జైలుకు పంపుతాడు. బెయిల్‌పై వచ్చాక నీ అంతు తేలుస్తానని భీమ్లానాయక్‌కు డ్యానీ వార్నింగ్ ఇస్తాడు. వారిద్దరి మధ్య వైరాన్ని కుటుంబ సభ్యులు కూడా బలపరుస్తారు. డ్యానీ వైరాన్ని అతడి తండ్రి మరింత పెంచేలా మాట్లాడుతుంటాడు. ఆ విషయంలో తగ్గొద్దంటూ భీమ్లా భార్య సుగుణ(నిత్యా మీనన్) చెబుతుంటుంది. తరువాత ఇద్దరి మధ్య పోరాటం ఎలాంటి మలుపు తిరిగింది, చివరికి ఏం జరిగిందనేది సినిమాలో చూడొచ్చు.
పవన్ కళ్యాణ్ ఖాకీ దుస్తుల్లో మరోసారి ఆకట్టుకున్నాడు. ఒరిజినల్ అయ్యప్పనుమ్ కోషియుమ్‌లో బిజూ మీనన్ పోషించిన పాత్రను తెలుగులో పవన్ పోషించాడు. ఇద్దరి యాక్టింగ్‌కు ఎంతో తేడా కనిపిస్తుంది. అక్కడ పృథ్వీరాజ్ సుకుమారన్ ధరించిన పాత్రను తెలుగులో రానా పోషించారు. నిజానికి ఒరిజినల్‌లో పృథ్వీ పాత్ర చుట్టూ ఎక్కువ కథ తిరుగుతుంది. తెలుగులో బీమ్లా నాయక్ పాత్ర చుట్టూ కథ ఉంటుంది. అయ్యప్పనుమ్ కోషియుమ్ భారీ నిడివితో ఉండగా, తెలుగులో మార్పులు చేసి కుదించారు. పవన్ తనదైన బాణీ పలికిస్తూ భీమ్లా పాత్రలో ఇట్టే ఒదిగిపోయారు. ఇక రానా డ్యానీ పాత్రలో జీవించారు. నిత్యమీనన్, సముద్రఖని తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన పాత్రధారులు సైతం పరిధికి తగ్గట్టు నటించారు. సినిమా విడుదలకు ముందు ఎంతో అలరించిన అంత ఇష్టమేందయ్యా పాట ఇందులో కనిపించలేదు. దీంతో ప్రేక్షకులు కొంత నిరాశకు గురయ్యారు.
ప్లస్ పాయింట్స్:పవన్ కళ్యాణ్, రానా పోటాపోటీ నటన, నిత్య మీనన్ కొత్త పాత్రలో దర్శనమివ్వడం, పవన్-రానా పోరాట సన్నివేశాలు.
మైనస్ పాయింట్స్: తొలి అర్థభాగం స్లోగా ఉందనే భావన, అంత ఇష్టమేందయ్యా సాంగ్ లేకపోవడం
రేటింగ్: 3.75/ 5.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa