భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అవడంతో శుక్రవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గం లో పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో బ్యాండ్ బాజా తో కార్ల తో ర్యాలీగా సినిమా థియేటర్లకు వచ్చి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. థియేటర్ల వద్ద భారీ కటౌట్లు ఏర్పాటు చేసి నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. థియేటర్ కి వచ్చిన అభిమానులు భీమ్లా నాయక్ సినిమా కొత్త రికార్డులను తిరగరాస్తుంది అని, రికార్డులను బద్దలు కొట్టడం కొత్త ట్రెండ్ సెట్ చేయడం కేవలం మా హీరో పవన్ కళ్యాణ్ కి సాధ్యమని అభిమానులు పవన్ కళ్యాణ్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.