ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్చి 4న హిందీలో భీమ్లా నాయక్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 25, 2022, 07:33 PM

మార్చి 4వ తేదీన భీమ్లా నాయక్ సినిమాను భారీస్థాయిలో హిందీలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇదిలావుంటే పవన్ కల్యాణ్ - రానా కాంబినేషన్లో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందిన 'భీమ్లా నాయక్' ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. సితార బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా, భారీ ఓపెనింగ్స్ ను రాబట్టినట్టుగా చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో చాలా వేగంగా బుకింగ్స్ ను పూర్తిచేసుకున్న సినిమాల్లో కూడా ఒకటి అని అంటున్నారు. ఈ సినిమాను హిందీలో కూడా ఈ రోజునే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అందుకు సంబంధించిన పనులు పూర్తికాకపోవడం వలన, చివరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చుకున్నారు. మార్చి 4వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో హిందీలో విడుదల చేయనున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలకు బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే - సంభాషణలు సమకూర్చిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన స్వరపరిచిన పాటలు ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతూ వెళ్లాయి. నిత్యామీనన్ .. సంయుక్త మీనన్ కథానాయికలుగా అలరించే ఈ సినిమాలో, సముద్రఖని .. రావు రమేశ్ .. మురళీ శర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa