బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రారంభించాడు. బాలకృష్ణకు ఇది 107వ సినిమా. మైత్రీ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమా ఇటీవలే సిరిసిల్ల జిల్లాలో తొలి షెడ్యూల్‌ను ప్రారంభించింది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.
రాయలసీమ నేపథ్యంలో సాగే కథ అని తెలిసింది. అక్కడి నీటి సమస్య చుట్టూ కథ తిరుగుతుందని తాజా సమాచారం. ఈ సినిమాలో బాలయ్య తండ్రీకొడుకులుగా కనిపిస్తారని సినీ వర్గాల సమాచారం. రెండు పాత్రల మధ్య ఉండే వైవిధ్యం సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు.
ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో శృతి హాసన్ కు మూడో సినిమా. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. విలన్ గా దునియా విజయ్ పేరు వినిపిస్తోంది. ఈ చిత్రానికి 'వీరసింహా రెడ్డి' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa