భీమ్లానాయక్ హిందీ రిలీజ్ మరో వారం వాయిదా పడింది. తెలుగుతోపాటే రిలీజ్ చేయాలని భావించినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు తెలిపారు. B4U మోషన్ పిక్చర్స్ ఈ చిత్రం హిందీ హక్కులను సొంతం చేసుకుంది. సినిమా హిందీ వెర్షన్ ట్రైలర్‌ను రెండుమూడ్రోజుల్లో విడుదల చేసి, మూవీని మార్చి 4న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. హిందీలో ఈ చిత్రాన్ని మార్చి 4న విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇక “భీమ్లా నాయక్” మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ అన్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మించారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa