ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్క్రిప్ట్ నచ్చితే...కొత్త దర్శకులైన సై: ఖుష్భూ వెల్లడి

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 25, 2022, 10:53 PM

స్క్రిప్ట్ నచ్చితే కొత్త దర్శకులైనా వారితో పనిచేసేందుకు తాను సిద్దమని సినీ నటి ఖుష్భూ పేర్కొన్నారు. తెలుగులో ఇప్పుడు సీనియర్ హీరోయిన్స్ జోరు నడుస్తోంది. ముఖ్యమైన .. కీలకమైన పాత్రలతో సీనియర్ హీరోయిన్స్ తెరపై సందడి చేస్తున్నారు. శర్వానంద్ - రష్మిక జంటగా నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాలో రాధిక .. ఖుష్బూ .. ఊర్వశి నటించడం విశేషం. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చేనెల 4వ తేదీన విడుదలవుతోంది. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో ఖుష్బూ మాట్లాడుతూ .. " ఆడవాళ్లు ఎప్పుడూ గ్లిజరిన్ వాడే పాత్రలే చేస్తారనే ఒక విమర్శ ఈ సినిమాతో మరుగున పడిపోతుంది. ఈ సినిమాలో ఆడవాళ్లు నవ్వుతూ .. నవ్విస్తూ సందడి చేస్తారు. సినిమా అప్పుడే అయిపోయిందా అనుకుంటారు. దర్శకుడు అంత గొప్పగా ఈ సినిమాను రూపొందించాడు. ఈ సినిమాలో నా పాత్ర ఎలా ఉందనే విషయాన్ని సినిమా చూశాక ఆడియన్స్ చెప్పాలి. తప్పకుండా మంచి మార్కులు పడతాయని అనుకుంటున్నాను. ఇప్పుడు కొత్త దర్శకులు .. కొత్త ఆలోచనలతో వస్తున్నారు. స్క్రిప్ట్ నచ్చితే కొత్త దర్శకులతో పనిచేయడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను" అంటూ చెప్పుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa