ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమంత ఆసక్తికరమైన పోస్ట్

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 26, 2022, 11:55 AM

ఏ మాయ చేశావే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమే ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది సమంత. అంతేకాకుండా వరుస చిత్రాలతో చేస్తూ సినీ ప్రియులను అలరించింది. అంతేకాకుండా తన సహచర నటుడు అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. గతేడాది అక్టోబరులో ఈ జంట విడాకులు తీసుకోగా.. అప్పటి నుంచి సమంత తన భవిష్యత్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో అప్పుడే తన ఇండస్ట్రీలోకి వచ్చి అప్పుడే 12 ఏళ్లు పూర్తయిందా అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టింది.


ఈ రోజు ఉదయాన్నే నిద్రలేవగానే నాకు ఓ విషయం తెలిసిందే. నేను చిత్రసీమకు వచ్చి అప్పుడే 12 ఏళ్లు పూర్తయిందని తెలుసుకున్నాను. 12 ఏళ్ల జ్ఞాపకాలు నా చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. కెమెరా, లైట్ యాక్షన్ అంటూ ఆ జ్ఞాపకాలు ఇంకా మెదులూనే ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత ఆదారాభిమానాలను కురిపిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎంతో ఆనందకరంగా సాగిన నా ప్రయాణాన్ని తలచుకుంటే గర్వంగా ఉంది. సినిమా పట్ల నా ప్రేమ కథ ఎప్పటికీ ముగియదని, ఇక్కడ బలానికి మరింత బలం చేకూరుతుందని ఆశిస్తున్నాను" అని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.


 


ప్రస్తుతం సమంత వరుస చిత్రాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. ఇటీవలే శాకుంతలం అనే పౌరాణిక చిత్రానికి శ్రీ కారం చుట్టింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సమంత పోస్టర్ కూడా విడుదలైంది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశముంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ‘శాకుంతలం’తో పాటు ‘యశోద’ అనే మహిళా ప్రధాన చిత్రంలో సమంత నటిస్తోంది.ఏ మాయ చేశావే చిత్రంతో సినీ పరిశ్రమలో సమంత అరంగేట్రం చేసింది. ఈ సినిమా విడుదలై నేటికి 12 ఏళ్లు పూర్తయింది. గౌతమ్ నీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎంతో ఘన విజయం సాధించింది. నాగ చైతన్య, సమంత కలిసి నటించిన మొదటి చిత్రం ఇదే. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa