పవన్ కళ్యాణ్ నటించిన "భీమ్లా నాయక్" సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ శుక్రవారం విడుదలైంది.సాగర్ కే చంద్ర దర్శకతంలో వచ్చిన ఈ సినిమాలో రానా,నిత్య మీనన్ అండ్ సంయుక్త మీనన్ కీలక పాత్రలు పోషించారు.ఈ మూవీకి అన్ని చోట్ల నుండి పాజిటివ్ రివ్యూస్ రాగా,పవన్ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.తాజాగా,టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపాడు.చిరు కూడా సాధారణంగా అభిమానులు ఉపయోగించే పవర్ స్టార్మ్ అనే పదాన్ని ఉపయోగిస్తూ ట్వీట్ చేసారు.ఈ మాస్ యాక్షన్ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ హౌస్ పై నాగవంశీ నిర్మించగా,థమన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa