తమిళ స్టార్ హీరో అజిత్,హెచ్ వినోద్ దర్శకత్వం లో నటించిన "వాలిమై" సినిమా వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో రిలీజ్ అయ్యింది.ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్‌గా నటించగా,హ్యూమా ఖురేషి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది.ఈ సినిమా ఫాన్స్ అండ్ సినిమా లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని సంపాదించింది.అయితే ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీ అనుకున్నట్టుగానే చెన్నైలో కలెక్షన్లు సాలిడ్ గా ఉన్నాయి.లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం,చెన్నైలో ఈ సినిమా ఫస్ట్ డే భారీ స్థాయిలో 1.9 కోట్ల గ్రాస్ వసూలు రాబటింది అని సమాచారం.బోనీకపూర్,జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాణి, సుమిత్ర, అచ్యుంత్ కుమార్, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa