ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్లామర్ బ్యూటీ హెబ్బా పటేల్ కంబ్యాక్ ఇవ్వనుందా?

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 26, 2022, 08:47 PM

టాలీవుడ్ లో 'కుమారి 21ఎఫ్' సినిమాతో హిట్ కొట్టిన డస్కీ బ్యూటీ హెబ్బా పటేల్ ఇప్పుడు విప్లవ్ కోనేటి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిన విషయమే.సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ లో వస్తున్న ఈ మూవీకి “తెలిసినవాళ్లు” అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు.రామ్ కార్తీక్ అండ్ హెబ్బా పటేల్ నటిస్తున్న ఈ సినిమాని సిరంజ్ సినిమా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.రొమాంటిక్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాపై హెబ్బా  చాలా ఆశలు పెట్టుకుంది.శ్రీ చరణ్ పాకాల ఈ ప్రాజెక్ట్‌కి సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం హెబ్బా పటేల్  'గీత', 'ఓదెల రైల్వే స్టేషన్‌', 'తెలిసినవాళ్ళు' చిత్రాల్లో నటిస్తోంది.
ఈ సినిమాకి సంబందించిన వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa