ఏపీ ప్రభుత్వ తీరుపై మెగా బ్రదర్ నాగబాబు మండిపడ్డారు. సినీ పరిశ్రమను, పవన్ కల్యాణ్ ను ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. లాయర్ సాబ్ నుంచి భీమ్లా నాయక్ సినిమా వరకు రాష్ట్ర ప్రభుత్వం పవన్ పై కక్ష కట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా టిక్కెట్ ధరలపై జీవో విడుదల చేయడం లేదని మండిపడ్డారు. జీవో విడుదల విషయంలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. పవన్ పై పగతో ఇలా చేస్తున్నా ఎవరూ నోరు మెదపడం లేదని నాగబాబు మండిపడ్డారు. పవన్ మద్దతు ఇవ్వకపోవడం దురదృష్టకరమని సినీ పెద్దలు అన్నారు. ప్రజలకు శాశ్వత అధికారం ఇవ్వలేదని, ఐదేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని వైసీపీ గుర్తుంచుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa