ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైరల్ అవుతున్న ధోని కొత్త లుక్

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 27, 2022, 11:57 AM

ఐపీఎల్ - 2022 ప్రమోషన్ ​లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని ఓ వీడియోలో నటించాడు. ఆ వీడియో ప్రోమోలో ధోని కొత్త లుక్​లో దర్శనమిచ్చాడు. ఈ మెగాటోర్నీని ప్రసారం చేసే స్టార్​స్పోర్ట్స్​ బ్రాడ్​కాస్టింగ్​ ఈ ప్రమోషనల్ వీడియోను రూపొందించింది. ఖాకీ చొక్కా, ప్యాంటు వేసుకుని కూలింగ్​ గ్లాస్ పెట్టుకుని​ పెద్ద మీసం, మెడలో కర్చీఫ్​, చేతిలో మైక్​ పట్టుకుని ధోనీ అదరగొట్టాడు. ఆటకు వేళాయే అన్నట్లుగా లుక్​ ఉంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్​గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa