ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బిగ్ బాస్' రచ్చ... సీపీఐ నారాయణ ను చెప్పులతో కొట్టాలి: తమన్నా

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 27, 2022, 01:11 PM

పాపులర్ రియాలిటీ షో 'బిగ్ బాస్' కొత్త సీజన్ ఇప్పుడు ఓటీటీలో ప్రసారం అవుతోంది. అయితే ఎప్పటిలాగే ఈ షోపై పలువురి నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సీపీఐ నారాయణ ఈ రియాలిటీ షోను తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఇది బిగ్ బాస్ హౌస్ అని పిలిచే వ్యభిచార గృహమని అన్నారు. అసభ్యకరమైన విషయాలను ప్రోత్సహిస్తూ ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారని, షో అనుమతిని రద్దు చేయాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా సీపీఐ నారాయణ వ్యాఖ్యలపై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి స్పందించారు. ఓ టీవీ డిబేట్‌లో తమన్నా మాట్లాడుతూ ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు నారాయణను చెప్పులతో కొట్టాలని అన్నారు. బిగ్ బాస్ షోను సమర్థిస్తూ అదే తమకు గుర్తింపు తెచ్చిపెట్టిందని అన్నారు. బయట ఊహిస్తున్నది నిజం కాదని, షో నచ్చని వాళ్లు ఛానల్ మార్చుకోవచ్చంటూ తమన్నా సింహాద్రి సలహా ఇచ్చారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa