టాలీవుడ్ సినిమాలలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ప్రభాస్"రాధే శ్యామ్"సినిమా ఒక్కటి.రాధాకృష్ణ డైరెక్షన్ లో రొమాంటిక్ డ్రామా ట్రాక్ లో వస్తున్న ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది.ఈ సినిమాలో యంగ్ రెబెల్ స్టార్ సరసన పూజా హెడ్జ్ నటిస్తుంది.ఈ చిత్రానికి థమన్ BGM కంపోజ్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.గత ఏడాది డిసెంబర్‌లో "రాధే శ్యామ్" టీమ్ హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది.అయితే కోవిడ్ కారణంగా సినిమా విడుదలను మేకర్స్ వాయిదా వేశారు.తాజాగా ఇప్పుడు,రాధే శ్యామ్ టీమ్ మరికొన్ని గ్రాండ్ ఈవెంట్‌లను ప్లాన్ చేస్తోంది.ఈ ప్రీరిలీజ్ ఈవెంట్స్ ముంబై,చెన్నైలలో జరగనున్నాయి అని లేటెస్ట్ టాక్.రాధే శ్యామ్ ప్రమోషన్లు మార్చి 1 లేదా 2వ తేదీ నుండి స్టార్ట్ అవుతాయి అని మేకర్స్ వెల్లడించారు.
యువి క్రియేషన్స్ ఈ హై బడ్జెట్ సినిమాని నిర్మిస్తుంది.తెలుగుతో పాటు తమిళం,కన్నడ,మలయాళం,హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.ఈ పీరియడ్ రొమాంటిక్ డ్రామాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa