ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచ వ్యాప్తంగా ‘సెబాస్టియన్‌ పిసి524’ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 01, 2022, 12:07 PM

మార్చి 4న ప్రపంచవ్యాప్తంగా ‘సెబాస్టియన్‌ పిసి524’ విడుదలవుతోంది. జ్యోవిత సినిమాస్‌ పతాకంపై కిరణ్‌ అబ్బవరం, కోమలీ ప్రసాద్‌, నివేక్ష నటీనటులుగా బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్‌లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘సెబాస్టియన్‌ పిసి524’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా, ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో సినీ అతిరథుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది. సామాజిక మాధ్యమమైన ట్విట్టర్ ద్వారా సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ట్రైలర్ ను విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయులు సమావేశంలో నిర్మాత సిద్ధారెడ్డి మాట్లాడుతూ.. "ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే విధంగా తెరకెక్కించడం జరిగింది. మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది" అన్నారు. నిర్మాతలు రాజు, ప్రమోద్ లు మాట్లాడుతూ.. "రాజావారు రాణి గారుతో ప్రేక్షకులను అలరించి, 'యస్.ఆర్. కళ్యాణ మండపం'తో ప్రభంజనం సృష్టించిన కిరణ్ అబ్బవరం తన మూడో చిత్రంలో రేచీకటి కాన్సెప్ట్ ను ఛాలెంజ్ గా తీసుకొని చక్కని నటనను ప్రదర్శించాడు. ఆద్యంతం అలరించే పట్టువదలని కథ, కథనంతో బాలాజీ చాలా చక్కగా తెరకెక్కించాడు. జిబ్రాన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. పాటలకు, టీజర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. మా టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడ్డారు. కిరణ్, నివేక్ష లు చాలా చక్కగా నటించారు.ఎంతో చక్కని కథతో తెలుగు ప్రేక్షకులను ఆలరించడానికి మా కిరణ్ అబ్బవరం మార్చి 4 న ఛార్జ్ తీసుకోబోతున్నాడు. రెండున్నర గంటల సేపు అందరినీ కట్టిపడేసే కథనంతో ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. చూసిన వారందరికీ మా సినిమా కచ్చితంగా నచ్చుతుంది" అన్నారు. దర్శకుడు బాలాజీ మాట్లాడుతూ.. మా సినిమా ట్రైలర్ ను విడుదల చేసిన విజయ్ దేవరకొండకు ధన్యవాదాలు. ఇప్పుడు విడుదలైన ట్రైలర్ కంటే సినిమా చాలా బాగుంటుంది. ఈ సినిమా చూస్తున్నవారికి ఒక రకమైన కామిక్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ని కలిగిస్తుంది. నిన్న మేము ఫస్ట్ కాపీ చూశాము .. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులందరూ ఈ సినిమాలోని కైండ్ ఆఫ్ విజువల్స్ బీస్ట్ ను, కైండ్ ఆఫ్ సౌండింగ్ ను ఎక్స్ పీరియన్స్ చేయడానికి వారి హియర్స్ ను, ఐస్ ను ప్రిపేర్ చేసుకోవాలి. సినిమా కథ రాసుకున్నప్పుడే చాలా ఎగ్జైట్మెంట్ అయ్యి రాసుకున్నాను. దీనికి తగ్గట్టు జిబ్రాన్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రేచీకటి పెర్ఫార్మన్స్ డీల్  చేయడం చాలా కష్టం. కానీ ఈ సినిమాలో కిరణ్ అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మన్స్ చేసాడు. 'మదనపల్లె'లో  32 రోజుల్లో ఈ సినిమా చేయడం జరిగింది. నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేశారు. ఇలాంటి మంచి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించిన కిరణ్ కు, నిర్మాతలకు, ధన్యవాదాలు" అన్నారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. మా సినిమా ట్రైలర్ ను విడుదల చేసిన విజయ్ దేవరకొండ కు ధన్యవాదాలు. సిల్వర్ స్క్రీన్ పై వస్తున్న ఈ సినిమాను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ఇందులో ప్రతి సెటప్ కూడా చాలా కొత్తగా ట్రై చేశాము. సిద్ధారెడ్డి, రాజు, ప్రమోదు గార్లు నాకు బాగా సపోర్ట్ గా నిలిచారు. జ్యోవిత బ్యానర్లో వస్తున్న ఈ సినిమా తరువాత ఈ బ్యానర్ మంచి మంచి సినిమాలు తీస్తూ ఎంతో మందికి అవకాశం కూడా కల్పిస్తుంది. నివేక్ష ,కోమలి ప్రసాద్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు. టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా కష్టపడ్డారు. బాలాజీ గారు నాకు రేచీకటి ఉన్న కథను చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ అయ్యాను. ఈ కథ చాలా ఇంట్రెస్ట్ అనిపించి ఈ సినిమా చెయ్యడం జరిగింది. రేచీకటి ఉన్న మనిషి లైఫ్ ఎలా ఉంటుందని బాలాజీ గారు చాలా బాగా చూపించారు. జిబ్రాన్‌ సంగీతం దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలోని పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి 'సెబాస్టియన్‌ పిసి524’ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా మంచి సినిమా చూశాము అనే ఫీలింగ్ తో బయటికి వస్తారు"  చెప్పుకొచ్చాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa