ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న పాట రా బాదం. పచ్చి బాదం సాంగ్ కి జనాలు ఊగిపోతున్నారు. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా తమదైన శైలిలో పాటకు స్టెప్పులేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ పాట పాడిన భుబన్ బధ్యాకర్ స్టార్ సింగర్ కాదు. బైకుపై పచ్చి పల్లీల మూట అమ్ముతున్నారు. శనగలు అమ్ముతూ పాడిన ఈ పాటను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వెలుగులోకి వచ్చింది. అనతికాలంలోనే సెలబ్రిటీ అయిపోయాడు. ఈ క్రమంలో మంచి డబ్బుతో కారు కొన్నాడు. సోమవారం తాను కొత్తగా కొనుక్కున్న కారును నేర్చుకునే క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు. గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa