'ఆదిపురుష్' విడుదల తేదీ మార్పు గురించి స్వయంగా హీరో ప్రభాస్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'ఆదిపురుష్'కు సంబంధించి శివరాత్రి పర్వదినం సందర్భంగా ఓ అప్ డేట్ ను చిత్ర యూనిట్ వదిలింది. ఈ ఏడాది ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే రిలీజ్ డేట్ ను మార్చినట్టు ప్రకటించారు. ఈ ప్రకారం, వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న త్రీడీ ఫార్మాట్లో సినిమాను విదుదల చేయనున్నట్టు తెలిపారు. బాలీవుడ్ స్ట్రయిట్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. సినిమా విడుదల తేదీ మారిన విషయాన్ని ప్రభాస్ కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa