ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'జూనియర్' గా రాబోతున్న హీరో నితిన్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 02, 2022, 04:30 PM

హీరో నితిన్ సినిమాలకు కూడా మార్కెట్ లో చెపుకోదగ్గ స్థానముంటుంది. తాజాగా ఆయన 'జూనియర్' అన్న టైటిల్ తో రాబోతున్నాడు. వక్కంతం వంశీ చాలా సినిమాలకు కథలను అందించాడు. తాను కూడా దర్శకుడిగా మారిపోయి ఆ మధ్య 'నా పేరు సూర్య' సినిమాను తెరకెక్కించాడు. అల్లు అర్జున్ హీరోగా నిర్మితమైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దాంతో సహజంగానే వంశీకి గ్యాప్ వచ్చేసింది. మళ్లీ ఇప్పుడు ఆయన దర్శకుడిగా తన రెండవ సినిమాతో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. నితిన్ హీరోగా ఆయన ఈ సినిమాను రూపొందించనున్నాడు. ఈ సినిమాకి 'జూనియర్' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఠాగూర్ మధు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం నితిన్ 'మాచర్ల నియోజక వర్గం' సినిమా చేస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ సొంత బ్యానర్లో ఈ  సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో కృతి శెట్టి ఆయన జోడీగా అలరించనుంది. ఈ సినిమా షూటింగు పూర్తికాగానే, వక్కంతం వంశీ ప్రాజెక్టును నితిన్ పట్టాలెక్కిస్తాడన్న మాట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa