కిషోర్ తిరుమల దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు.కన్నడ బ్యూటీ రష్మిక ఈ సినిమాలో శర్వా సరసన నటించబోతోంది.ఖుష్బు సుందర్,రాధిక శరత్‌కుమార్,ఊర్వశి కీలక పాత్రలు పోషిస్తున్నారు.లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం,ఈ మూవీ 141 నిమిషాల రన్‌టైమ్‌ని కలిగి ఉందని మేకర్స్ వెల్లడించారు.రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ట్రాక్ లో వస్తునా ఈ సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా,ఈ సినిమా పై శర్వా చాలా ఆశలు పెట్టుకున్నాడు.ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని SLV సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa