లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం తనయుడు గౌతమ్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.అతని పుట్టినరోజు సందర్భంగా,మేకర్స్ ఒక స్పెషల్ గ్లిమ్ప్స్ ని విడుదల చేశారు.సుబ్బు చెరుకూరి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని ఎస్ ఒరిజినల్ బ్యానర్ తమ 10వ వెంచర్‌గా నిర్మిస్తోంది.'ఒంటరితనం ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా?'అని వాయిస్‌ఓవర్‌తో ఈ గ్లింప్సె ప్రారంభమవుతుంది.'మను' సినిమాతో ఆడియన్స్ కి తన టాలెంట్ ని చూపించిన గౌతమ్ ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు.ఈ చిత్రంలో మనోఫోబియాతో బాధపడుతున్న రచయితగా గౌతమ్ కనిపించనున్నాడు.ఈ థ్రిల్లర్ మూవీకి ఎంఎస్ జోన్స్ రూపర్ట్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa