రాధాకృష్ణ డైరెక్షన్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా మార్చి11న ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.ఈ భారీ బడ్జెట్ చిత్రంలో సిజ్లింగ్ బ్యూటీ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.ప్రస్తుతం,ప్రభాస్ గత రెండు రోజులుగా ముంబైలో ఈ మూవీ ప్రొమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.తాజా అప్డేట్ ప్రకారం,ప్రభాస్ ఇప్పుడు చెన్నైలో జరిగే ప్రొమోషన్స్ కి హాజరవుతున్నాడు అని సమాచారం.తమిళ మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వబోతున్నాడు అని లేటెస్ట్ టాక్.యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రంలో కృష్ణం రాజు,జగపతి బాబు,భాగ్యశ్రీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఈ పెరియాడికల్ రొమాంటిక్ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ పాటలు కంపోజ్ చేయగా,థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa