ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈరోజు విడుదల కానున్న రాజ్ తరుణ్ 'స్టాండ్ అప్ రాహుల్' ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 04, 2022, 10:55 AM

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ 'స్టాండ్ అప్ రాహుల్' అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో ఆడియన్స్ ముందుకు  రాబోతున్నాడు అని తెలిసిన సంగతే.సంతో మోహన్ వీరంకి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బబ్లీ బ్యూటీ వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ మూవీలో C/o కంచరపాలెం సినిమా డైరెక్టర్ వెంకటేష్ మహా గెస్ట్ రోల్ లో నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని ఈరోజు స్పెషల్ గా రిలీజ్ చేస్తున్నట్లుగా సమాచారం.ఈ సినిమాలో వెనిల్లాకిషోర్,మురళీ శర్మ,ఇంద్రజ,దేవి ప్రసాద్,మధురిమ కీలక పాత్రలు పోషిస్తున్నారు.డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa