ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో ఆ బాలీవుడ్ హీరోయిన్ పెళ్లి..!

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 04, 2022, 12:02 PM

రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఝుమ్మంది నాదం సినిమాతో కెరీర్ ప్రారంభించిన ప్రముఖ కథానాయిక తాప్సీ పన్ను. తెలుగులో అగ్ర హీరోల సరసన వరుసగా నటించింది. కాలక్రమేణా ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయి బాలీవుడ్‌కి వెళ్లింది. అక్కడ వైవిధ్యమైన చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. దిల్ రుబా, తప్పడ్, పింక్, ముల్క్, బదలా ఇలా ఎన్నో విభిన్నమైన, వైవిధ్యమైన సినిమాలు చేసి టాప్ హీరోయిన్ గా ఎదిగింది హసీనా. అలా ప్రముఖ విదేశీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి మథియాస్‌ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కొన్నేళ్లుగా అతడితో ప్రేమలో ఉంది. వీరి పెళ్లికి కుటుంబ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. పెళ్లి తేదీ కూడా ఫిక్స్ అయిందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాక్. మరోవైపు తీరిక లేకుండా సినిమాలు చేస్తున్న తాప్సీ.. వీలు చిక్కినప్పుడల్లా మథియాస్‌తో కలిసి విహార యాత్రలకు వెళ్లింది. ఎట్టకేలకు వీరి ప్రేమ ఫలించి పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కుతుందని సన్నిహితులు ఎదురుచూస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa