షణ్ముఖ్ జస్వంత్ కాండ్రేగుల ఒక యూట్యూబర్,అలాగే తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 5 కంటెస్టెంట్‌లలో అతను కూడా ఒకడు. షణ్ముఖ్ జస్వంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో తమిళ స్టార్ సూర్యను కౌగిలించుకుని ఉన్న కొన్ని ఫోటోలు అండ్ వీడియోలను పోస్ట్ చేసాడు.ఐ లవ్ యు సూర్యా అన్నా!3-3-2022 సంతోషకరమైన రోజు అవుతుంది!గత కొన్ని నెలలుగా చాలా ఫెయిల్యూర్స్ తర్వాత ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను!ఈ బ్యూటిఫుల్ డే కి థాంక్స్!!! అంటూ షణ్ముఖ్ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు.గతంలో బిగ్ బాస్ 5 తెలుగు టాస్క్‌లలో ఒకదానిలో అతను పాపులర్ సింగం సిరీస్‌లోని సూర్య పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa