వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవనున్నారు. వారాహి చలన చిత్రం బ్యానరుపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంతో రాధా కృష్ణ దర్శకుడిగా పరిచయం అవ్వనున్నారు. పెళ్ళి సందడి ఫేమ్ శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ కాగా జెనీలియా కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాతో జెనీలియా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనుండటం విశేషం. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అత్యుత్తమ టెక్నిషియన్లు పని చేయనున్నారట. తాజాగా శుక్రవారం ఈ చిత్రానికి సంబంధించి ప్రారంభ కార్యక్రమం బెంగళూరులో ఘనంగా నిర్వహించారు. పలు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి ముఖ్య అతిధిగా పాల్గొని ఫస్ట్ క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా కిరీటి ఇంట్రడక్షన్ వీడియోని రిలీజ్ చేసారు. యంగ్ అండ్ డైనమిక్ గా కనిపిస్తున్న కిరీటి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బావుందని తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa