ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేజీఎఫ్ సీక్వెల్...సంజయ్ దత్ అదనపు క్రేజ్ కాబోతున్నారా

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 06, 2022, 03:45 PM

సినీ రంగ చరిత్రలో అద్భుత విజయాలు సాధించిన జాబితాలో కేజీఎఫ్ ఒకటి. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'కేజీఎఫ్' దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక కన్నడ సినిమా ఈ స్థాయి విజయాన్ని సాధించడం .. అనూహ్యమైన వసూళ్లను రాబట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రాంతం .. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమాను అంతా ఆదరించారు .. భారీ విజయాన్ని ముట్టజెప్పారు. దాంతో ఈ సినిమాకి సీక్వెల్ ను సిద్ధం చేశారు. ఈ సారి ఈ సినిమాకి సంజయ్ దత్ క్రేజ్ కూడా తోడవుతోంది. ఈ సినిమాలో ఆయన ఒక కీలకమైన పాత్రను పోషించారు. ఆయన పాత్ర ఈ సినిమాకి హైలైట్ అవుతుందని అంటున్నారు. కరోనా కారణంగా విడుదల విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది.  ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. ఈ నెల 27వ తేదీన గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నట్టుగా కొంతసేపటి క్రితం పోస్టర్ ను వదిలారు. రవి బస్రూర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ప్రకాశ్ రాజ్ .. రావు రమేశ్ .. రవీనా టాండన్ .. శ్రీనిధి శెట్టి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa