ఏపీలో సినిమా టికెట్ల ధరలపై నటుడు ప్రభాస్ స్పందించాడు. తాను నటించిన 'రాధేశ్యామ్' సినిమా విడుదలకు ముందే ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలపై జీవో ఇస్తే సంతోషిస్తానని అన్నారు. అయితే దీనికి సంబంధించిన విషయాలు తనకు తెలియలేదని ప్రభాస్ చెప్పాడు. అయితే కొన్ని రోజుల క్రితం చిరంజీవి, మహేష్ బాబు, రాజమౌళిలతో పాటు ప్రభాస్ కూడా సీఎం జగన్ ను కలిసిన విషయం తెలిసిందే. సినిమా టికెట్ల ధరలను పెంచాలని వారు సీఎం జగన్ ని కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ రేట్లు పెంచాలని రిపోర్టు ఇచ్చినా ప్రభుత్వం ఇంకా జీవో జారీ చేయలేదు.