టాలీవుడ్ హీరో విష్ణు మంచు ప్రస్తుతం ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో విష్ణు సరసన పాయల్ రాజ్‌పుత్ నటిస్తుంది.కొద్ది రోజుల క్రితం విష్ణు ఈ సినిమాకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.సోషల్ మీడియా లో ఈ సినిమాలో గాలి నాగేశ్వరావ్ పాత్రను పోషిస్తున్నట్లు వెల్లడించారు.అలాగే,పాయల్ రాజ్‌పుత్ తన పాత్ర పేరు స్వాతి అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.తాజాగా బాలీవుడ్ యాక్ట్రెస్ సన్నీలియోన్,ఈ సినిమాలో తన పేరు రేణుక అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
ఈ చిత్రానికి కోన వెంకట్ కథ అండ్ స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేసారు.ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.ఈ మూవీకి మేకర్స్ ఇంకా టైటిల్ ని లాక్ చేయలేదు.ఈ ప్రాజెక్ట్‌కి అనూప్ రూబెన్స్ సంగీత అందిస్తున్నారు.ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ రానున్న రోజులలో మేకర్స్ వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa